శృంగారంలో పాల్గొంటే వంద కొర‌డా దెబ్బ‌లు..

ఒక్కో దేశంలో ఒక్కోలా చట్టాలు ఉంటాయి.  మ‌న దేశంలో అయితే పెళ్లయిన‌ వాళ్లయినా ఇద్ద‌రి ఇష్టంతోనే శృంగారంలో పాల్గొనాలి. అలా కాకుండా బ‌ల‌వంతం చేయాల‌ని చూస్తే కేసు పెట్టొచ్చు. ఇక దుబాయ్‌లో కూడా విచిత్ర‌మైన నిబంధ‌న‌లు ఉన్నాయి.

విష‌య‌మేమిటంటే పెళ్లి కాకుండా శృంగారంలో పాల్గొన్నందుకు యువ‌తీ, యువ‌కుల‌కు వంద కొర‌డా దెబ్బ‌లు శిక్ష వేశారు. అబుదాబీ న్యాయ‌స్థానం ఈ ర‌క‌మైన శిక్ష విధించింది. ఓ ప్ర‌వాస వ్య‌క్తి అక్క‌డి మ‌హిళ‌తో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే వీరిద్ద‌రికి పెళ్లి కాలేదు. దీంతో న్యాయ‌స్థానంలో ఇద్ద‌రికి కొర‌డా దెబ్బ‌ల‌తో పాటు యువ‌కుడికి ఏడాది పాటు జైలు శిక్ష కూడా వేశారు. ఆ దేశంలో చ‌ట్టాలు క‌ఠినంగా ఉంటాయి. పైగా విచారణలో ఈ యువ ప్రవాసులు తాము అక్రమ లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు అంగీకరించారు.

షరియా చట్టం, ఫెడరల్ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 121/1 ప్రకారం వీరికి ఈ శిక్షను విధించిన‌ట్లు అక్క‌డి కోర్టు పేర్కొంది. ఇక ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం పెళ్లికానివారు అక్రమ లైంగిక సంబంధం కలిగి ఉంటే 100 కొరడా దెబ్బల శిక్ష విధించబడుతుంది. పైగా యువ‌తీ, యువ‌కులు చేసిన ప‌నిని అంగీక‌రించిన నేప‌థ్యంలో చ‌ట్టం ప్ర‌కార‌మే శిక్ష విధిస్తారు.  దీని ప్రకారమే ఇప్పుడు ఈ ఇద్దరు ప్రవాసులకు చెరో వంద కొరడా దెబ్బలతో పాటు యువ‌కుడికి ఏడాది జైలు శిక్ష విధించారు. ప్ర‌పంచ దేశాల్లో ఉన్న క‌ఠిన చ‌ట్టాల గురించి విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అలాంటి శిక్ష‌లు మ‌న దేశంలో కూడా అమ‌లు చేయాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here