వైద్యులు తీవ్ర‌వాదులా.. మాజీ మంత్రి చిన‌రాజ‌ప్ప

ఏపీ ప్ర‌భుత్వ తీరుపై మాజీ మంత్రి, టిడిపి నేత నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వై.ఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ డాక్ట‌ర్లు, టిడిపి నాయ‌కుల‌పై క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. కోవిడ్ ఆస్ప‌త్రుల్లో సౌక‌ర్యాలు క‌ల్పించి క‌రోనా నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

వైద్యుడు ర‌మేష్ ఆచూకి కోసం రూ. ల‌క్ష రూపాయ‌లు రివార్డు ప్ర‌క‌టించ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. డాక్ట‌ర్ ర‌మేష్‌పై ప్ర‌భుత్వం కులం పేరుతో క‌క్ష్య సాధిస్తోంద‌న్నారు. ఈ ప్ర‌భుత్వం వైద్యుల‌ను తీవ్ర‌వాదుల‌లాగా చూస్తోంద‌న్నారు. మాస్క్ అడిగినందుకు డాక్ట‌ర్ సుధాక‌ర్‌పై దాడులు చేశార‌ని గుర్తు చేశారు.

వేధింపుల వ‌ల్ల వైద్యులు మ‌నోధైర్యం కోల్పోతున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో రోగుల‌కు ఆక్సిజ‌న్ లేద‌న్నారు. రోగుల‌కు స‌రైన వైద్యం కూడా అంద‌డం లేద‌న్నారు. వైద్యులపై వేదింపుల వ‌ల్ల రోగుల‌కు చికిత్స చేయ‌డానికి కూడా డాక్ట‌ర్లు ముందుకు రావ‌డం లేద‌న్నారు. ప్ర‌భుత్వ క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు మానుకొని క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here