గూగుల్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..

ఇప్పుడు అంద‌రి చేతిలో స్మార్ట్ ఫోన్ఉంది. ఫోన్ ఉన్న వాళ్లంద‌రికీ గూగుల్ అంటే ఏంటో తెలుసు. సెల్ ఓపన్ చేస్తే నేరుగా గూగుల్‌లోకే వెళ‌తాం. అలాంటి గూగుల్ ఒక్క‌సారిగా ఆగిపోవ‌డంతో ప్ర‌జ‌లంద‌రూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది ఒక్క ప్రాంతంలో జ‌రిగింది కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా గూగుల్ సేవ‌లు దాదాపు 45 నిమిషాలు ఆగిపోయాయి.

నేటి స‌మాజంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన వారికి, ఏ రంగానికీ చెందని వారికి కూడా గూగుల్‌ లేదా గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌, జీమెయిల్‌ వంటి సేవలు జీవితంలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో సోమవారం 45 నిమిషాల పాటు గూగుల్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇబ్బంది పడ్డారు. యూట్యూబ్‌, జీమెయిల్‌, గూగుల్‌ డాక్స్‌, గూగుల్‌ కేలండర్‌ తదితర సేవలన్నీ నిలిచిపోయాయి. అంతర్గతంగా నిల్వ సామర్థ్య సమస్యల వలన ఈ ఇబ్బం ది తలెత్తిందని, వెంటనే పరిష్కరించామని గూగుల్‌ తెలిపింది.

సాయంత్రం 5.17 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల గూగుల్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. 6 గంటల 02 నిమిషాలకు సేవలను పునరుద్ధరించాం. అంతరాయం కలిగినందుకు క్షమాపణలు కోరుతున్నాం. ఈ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని గూగుల్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టులోనూ గూగుల్‌ ఇదే తరహా సమస్యను ఎదుర్కోవడం గమనార్హం. యూట్యూబ్‌ ఇన్‌కాగ్నిటో విధానంలో మాత్రం కొంతమందికి పనిచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here