చంద్ర‌బాబు సీఎం కావాల‌ని ఎవ‌రు కోరుకుంటున్నారో తెలుసా..

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు 2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి చ‌వి చూసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ‌య‌వంతంగా పాల‌న సాగిస్తున్నారు. అయితే మ‌రోసారి టిడిపి అధికారంలోకి వ‌స్తోందని నేత‌లు అంటున్నారు.

నారా లోకేష్ మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో అభివృద్ది బాగా జ‌రిగింద‌ని అన్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీ నుంచి పారిశ్రామిక వేత్త‌లు పారిపోతున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఏపీలో అభివృద్ధి ఆగిపోయింద‌ని లోకేష్ అన్నారు. జ‌గ‌న్ త‌న కేసుల కోసం ప్ర‌జాధ‌నంతో ఢిల్లీ వెళ్లార‌ని అన్నారు. రైతుల‌పై మండిప‌డుతున్న మంత్రుల‌ను ఆపాల్సిన బాద్య‌త సీఎం జ‌గ‌న్‌పై ఉంద‌న్నారు.

2024లో చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా అమరావతి సాధించే వరకు వెనుతిరిగేది లేదన్నారు. అమ‌రావ‌తి రైతుల‌కు లోకేష్ సంఘీభావం తెలిపిన విష‌యం తెలిసిందే. ఇక రాష్ట్రంలో మ‌రోసారి టిడిపి అధికారం వ‌స్తుంద‌న్న మాట‌ల‌ను ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు వై.ఎస్ జ‌గ‌న్ అన్ని విధాలా ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌జేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో మ‌రో ప‌ది సంవ‌త్స‌రాల పాటు వైసీపీ అధికారంలో ఉంటుంద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. కానీ టిడిపి నేత‌లు ఇలా మాట్లాడుతుండ‌టం విడ్డూరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here