చెప్పిన జీతం ఇవ్వ‌నందుకు 5వేల మంది ఉద్యోగులు ఏం చేశారో తెలుసా..

ఓ కంపెనీ ఉద్యోగులు ముందుగా చెప్పిన జీతం ఇవ్వ‌నందుకు తిర‌గ‌బ‌డ్డారు. ఉద్యోగంలో చేరే స‌మ‌యంలో ఒప్పందం చేసుకున్న వేతనం ఇవ్వ‌కుండా పూర్తిగా త‌గ్గించి జీతం ఇవ్వ‌డంతో కంపెనీపై దాడి చేశారు. చివ‌ర‌కు పోలీసులు రంగంలోకి దిగారు.

కర్ణాటకలోని కోలార్ జిల్లా, నరసాపుర వద్ద విస్ట్రన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐఫోన్ ప్లాంట్ ఉంది. ఇది తైవాన్ కంపెనీ. నియామకం సమయంలో ప్రకటించిన జీతాల కన్నా తక్కువ జీతాలు చెల్లించడంతో ఈ కంపెనీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు రూ.21 వేలు నెల జీతం చెల్లిస్తామని చెప్పిన ఈ కంపెనీ, ఆ మాట నిలబెట్టుకోకుండా నెలకు రూ.12 వేలకు తగ్గించింది. నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, రూ.8 వేలకు తగ్గించింది. దీంతో ఉద్యోగులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

శనివారం ఉదయం భారీగా ప్లాంట్ వద్దకు చేరుకుని తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వాహనాలకు నిప్పు పెట్టి, అసెంబ్లీ యూనిట్లను ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై ఓ పోలీస్ కానిస్టేబుల్ మాట్లాడుతూ, తాను రాత్రి గస్తీ విధులను ముగించుకుని, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం జరిగిందన్నారు. ప్లాంట్‌లో ఏదో గొడవ జరుగుతున్నట్లు తెలుసుకుని, తనను అక్కడికి పంపించారన్నారు. అప్పటికే ప్లాంట్ వద్ద దాదాపు 5 వేల మంది ఉన్నారని, పొద్దున్నే అంతమందిని చూసి, తాము దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. తాము తక్కువగా ఉన్నామని, అదనపు బలగాలని పిలవక తప్పదని నిర్ణయించుకున్నామని తెలిపారు. కోపంతో ఊగిపోతున్న ఉద్యోగులు తమకు కనిపించినదాన్ని ధ్వంసం చేశారన్నారు. కోలార్ జిల్లాలో ఇటీవలి కాలంలో ఇంత భారీగా సామూహిక విధ్వంసాన్ని తాము చూడలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here