దిల్ రాజు కి హీరో కావలెను

ఈ యేడాది 5 హిట్లు అందుకొన్న నిర్మాత దిల్‌రాజు. ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. దిల్ రాజు బ్యాన‌ర్ బ్రాండ్ వాల్యూ సినిమా సినిమాకీ పెరుగుతూ పోతోంది. ఇప్పుడు కూడా చేతిలో మూడు నాలుగు సినిమాల్ని ఉంచుకొన్నాడు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కు ఒక స్టార్ హీరో కావ‌ల్సివ‌చ్చింది.

స‌తీష్ వేగ్నేశ `శ్రీ‌నివాస క‌ల్యాణం` అనే క‌థ‌ని రెడీ చేశాడు. ఈ క‌థ‌ని స్టార్ హీరోతోనే చేయాల‌న్న‌ది దిల్ రాజు ఆలోచ‌న‌. అందుకోసం దిల్‌రాజు త‌న ప్ర‌య‌త్నాల్ని కూడా ముమ్మ‌రం చేశారు. ఎన్టీఆర్‌తో ఈ సినిమా చేయ‌డానికి దిల్‌రాజు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈమ‌ధ్యే ఎన్టీఆర్‌కి క‌థ‌నీ వినిపించారు. కాక‌పోతే ఎన్టీఆర్ త‌న నిర్ణ‌యాన్ని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

త్రివిక్ర‌మ్‌తో సినిమా గ్యాప్ వ‌స్తే… శ్రీ‌నివాస క‌ల్యాణం ప‌ట్టాలెక్కిద్దామ‌నుకొన్నాడు ఎన్టీఆర్‌. కానీ… ఎన్టీఆర్ సినిమా జ‌న‌వ‌రి – ఫ్రిబ్ర‌వరిలోగా మొద‌లైపోతుంది. న‌వంబ‌రు, డిసెంబ‌రులోగా ఓ సినిమా పూర్తి చేసే ఛాన్సే లేదు. కాబ‌ట్టి… ఎన్టీఆర్ అనే ఆప్ష‌న్ దిల్‌రాజు నుంచి చేజారిపోయింది.

జ‌న‌వ‌రిలో శ్రీ‌నివాస క‌ల్యాణం మొద‌లెట్టి – ఆగ‌స్టులో విడుద‌ల చేయాల‌న్న‌ది దిల్‌రాజు ఆలోచ‌న‌. అయితే స్టార్ హీరోలంతా త‌మ త‌మ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. నాని, వ‌రుణ్‌తేజ్‌, శ‌ర్వానంద్‌లూ ఖాళీగా లేరు. అందుకే.. శ్రీ‌నివాస క‌ల్యాణం ఓ హీరో కోసం ఎదురుచూపుల్లో ప‌డిపోయింది. మ‌రి.. దిల్‌రాజు ఎవ‌రిని సెట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here