పవన్ అభిమానులకు దిల్ రాజు ఆర్థికసాయం..

తన అభిమాన హీరో పుట్టిన రోజును ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఆశించిన ఆ అభిమానులు తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. నేడు (బుధవారం) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో 30 అడుగుల పవన్ ఫ్లెక్సీని కడుతూ, విద్యుదాఘాతానికి గురై మంగళవారం ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన నటుడు పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

ఇదిలా ఉంటే పవన్ నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” చిత్ర యూనిట్ కూడా ఈ దుర్ఘటనపై స్పందించింది. ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ ట్విట్టర్ వేదికగా బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. పవన్ అభిమానులు చనిపోవడం చాలా బాధగా ఉందని ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని.. మృతి చెందిన కుటుంబాలకు రూ.  2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందిస్తామని అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రముఖ నిర్మాత దిల్ రాజుదనే విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here