ప్ర‌భాస్, దీపిక ప‌దుకొనే సినిమాపై పుకార్లు..!

దీపికా ప‌దుకొనే కోట్లు డిమాండ్ చేస్తోంది. ఉన్న‌ట్టుండి ఆమె రెమ్యున‌రేష‌న్ ప‌దికోట్లకు పైగా పెరిగిపోయింది. తాజాగా ఆమె ప్ర‌భాస్‌తో సినిమా చేసేందుకు ఒప్పుకుంది.

బాలివుడ్ న‌టి దీపికా ప‌దుకొనే రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేసిన‌ట్లు తెలుస్తోంది. హీరో ప్ర‌భాస్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి అశ్వినీద‌త్ నిర్మాత‌. అయితే దీపికాను హీరోయిన్‌గా ఎంపిక చేయాల‌ని చిత్ర యూనిట్ భావించ‌గా.. ఆమె తాజాగా రెమ్యున‌రేష‌న్ 20 నుంచి 30 కోట్ల రూపాయ‌ల‌ని చెప్పిందట‌.

మామూలుగా 11 నుంచి 15 కోట్ల రూపాయ‌లు తీసుకునే ఈ అమ్మ‌డు ఒక్క‌సారిగా రెమ్యున‌రేష‌న్ పెంచేసినా నిర్మాత‌లు ఓకే చేశార‌ని తెలుస్తోంది. అయితే ఇంత‌వ‌ర‌కు ఏ హీరోయిన్ కు కూడా ఇంత‌లా రెమ్యున‌రేషన్ ఇవ్వ‌లేద‌ని.. ఈ రెమ్యున‌రేష‌న్‌పై ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here