ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఇలాంటి కామెంట్లు ఏంటి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా వై.ఎస్ జ‌గ‌న్‌కు అభిమానులుంటే. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే రాజ‌కీయాల్లో మాత్రం జ‌గ‌న్‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. కాగా జ‌న‌సేన‌తో కలిసి తిరిగిన పార్టీలు ఇప్పుడు ప‌వ‌న్‌పై మండిప‌డుతుండ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంది.

2019 ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన‌, సీపీఎం, సీపీఐ, బీఎస్పీల‌తో క‌లిసి పొత్తు పెట్టుకుంది. వీరంతా క‌లిసి ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో కార్య‌క్ర‌మాలు కూడా చేశారు. క‌చ్చితంగా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తామ‌న్న ధీమాను వ్య‌క్తం చేసిన వారికి నిరాశే ఎదురైంది. కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా గెల‌వ‌లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఆ పార్టీ అభ్య‌ర్థి రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలుపొందారు. ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఓడిపోవ‌డం అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నమే అయ్యింది. ప్ర‌జ‌ల కోస‌మే నేను అన్న ప‌వ‌న్ కల్యాణ్ మాట‌లు ఎవ్వ‌రూ న‌మ్మ‌లేద‌ని ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా తెలిసింది.

ఆ త‌ర్వాత ప‌వ‌న్ బీజేపీతో జత‌క‌ట్టారు. ఇరు పార్టీలు పొత్తుతో ముందుకు వెళుతున్నాయ‌. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్నారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన స‌మ‌యంలో ప‌వ‌న క‌ల్యాణ్‌తో అన‌వ‌స‌రంగా పొత్తు పెట్టుకున్నామ‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌న అన్నారు. అప్పుడు త‌మ‌తో న‌డిచిన వ్య‌క్తి ఇప్పుడు మోదీ కాళ్లుప‌ట్టుకుంటున్నార‌ని ప‌వ‌న్‌ను ఉద్దేశించి నారాయ‌ణ మాట్లాడారు. అయితే ఎన్నిక‌లు ముగిసిన ఇన్నాళ్ల‌కు ఈ విష‌యంలో సీపీఐకి లైట్ వెలిగింద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా ఇప్పుడు బీజేపీతో జ‌న‌సేన పొత్తు ఎలా ఉంటుందో అర్థం కావ‌డం లేదు. ఈ పొత్తుపై ప‌లువురు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఈ ఇరు పార్టీల మ‌ద్య పొత్తు ఎన్నాళ్లు ఉంటుందంటున్నారు. ఎన్నిక‌లు అవ్వ‌గానే వామ‌ప‌క్ష పార్టీల‌ను కాద‌ని వేరే పార్టీకి మ‌ద్ద‌తుగా వెళ్లిపోయిన ప‌వ‌న్‌. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కు ఈ పార్టీతో క‌లిసి ఉంటారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here