ఇది రాసుకోవాల్సిందే.. జ‌గ‌న్‌ను పొగిడిన బీజేపీ నేత‌..

ఏపీలో సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో అన్ని వ‌ర్గాల వారికి మంచి జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ విష‌యాన్ని ప్రతిప‌క్షాలే చెబితే ఇంకా అంత క‌న్నా గుడ్ న్యూస్ ఏముంటుంది. స‌రిగ్గా ఇప్పుడు ఇదే జ‌రుగుతోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో పొగాకు రైతుల‌కు బాగా మేలు జ‌రిగింది. ప్ర‌భుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి పొగాకును కొనుగోలు చేసింది. దీంతో ఎన్న‌డూ లేని విధంగా పొగాకు రైతులు ల‌బ్ది పొందుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఒంగోలులో పొగాకు రైతుల‌తో జ‌గ‌న్ మాట్లాడిన‌పుడు వారి ప‌రిస్థితిని చూసి తాను అధికారంలోకి వ‌చ్చాక మంచి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ఇప్పుడు వారికి ఆర్థిక భ‌రోసా క‌ల్పించారు.

సీఎం పొగాకు రైతుల ప‌ట్ల తీసుకున్న నిర్ణ‌యంతో రాష్ట్రమంతా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఈ విష‌యంలో బీజేపీ నేత‌, టుబాకో చైర్మ‌న్ య‌డ్ల‌పాటి ర‌ఘునాథ్ బాబు సైతం సీఎంను అభినందించారు. ప్ర‌భుత్వ చొర‌వ‌తో మార్క్‌ఫెడ్ జోక్యం చేసుకోవ‌డం వ‌ల్ల రైతుల‌కు సుమారు రూ. 125 కోట్ల లాభం వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. సీఎంను క‌లిసి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపారు. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాల వ‌ల్ల రైతులు లాభ ప‌డుతున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లే చెబుతుంటే ఇంకేం కావాల‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఏదిఏమైనా రైత‌న్న‌ల‌కు మంచి చేసే ప్ర‌భుత్వం రావ‌డం అదృష్ట‌మ‌ని రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here