ర‌జినీకాంత్ సినిమా షూటింగ్‌లో కొంద‌రికి క‌రోనా.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ర‌జినీ..

క‌రోనా కార‌ణంగా సూప‌ర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు బ్రేక్ ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ఓ టాక్ న‌డుస్తోంది. అయితే కేవ‌లం పాజిటివ్ వ‌చ్చిన వారికి మాత్ర‌మే విరామం ఇచ్చి మిగ‌తా వారితో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాల‌ని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. వివ‌రాల్లోకి వెళితే ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమా అన్నాతై షూటింగ్ జ‌రుగుతోంది.

అయితే ఓ వైపు రాజ‌కీయ పార్టీ గురించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూనే మ‌రోవైపు అన్నాతై షూటింగ్‌లో ర‌జినీ పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోషూటింగ్‌స్పాట్‌లో నలుగురికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో షూటింగ్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రజనీని పరిశీలించిన వైద్యులు ఆయనకు కరోనా లక్షణాలు లేవని ప్రకటించారు. అయినా మరోమారు కరోనా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలని రజనీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ పరీక్ష చేసుకున్న తర్వాత ఈనెల 28లోగా ఆయన చెన్నై తిరిగివస్తారు. దీంతో ఇప్పుడు ఆయ‌న అభిమానులు కూడా త్వ‌ర‌గా షూటింగ్ ముగించుకొని రావాల‌ని ఆయ‌న్ను కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here