పార్లమెంటు సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఓ కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడం కలకలం రేపుతోంది. దీంతో ఎంపీలందరూ కరోనా పరీక్షల కోసం క్కూ కడుతున్నారు.
ఈ నెల 14వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే పార్లమెంటు మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. పార్లమెంటుకు హాజరయ్యే ఎంపీలంతా తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించుకున్న కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేనట్లు తెలుస్తోంది. మరి పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్ల ఆయన తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన వెల్లడించారు. కాగా పార్లమెంటు సమావేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రికి కరోనా రావడం చర్చనీయాంశమైంది. కాగా పార్లమెంటు ప్రారంభం అయ్యే లోపు ఎంత మందికి కరోనా పాజిటివ్ అని వస్తుందో వేచి చూడాలి. కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్‌గా ఉన్నట్లు రిపోర్టు వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ సారి పార్లమెంటు సమావేశాలకు ఎంత మంది హాజరవుతారో వేచి చూడాలి.






