మ‌రోసారి క‌రోనా విజృంభ‌ణ‌.. బార్లు, రెస్టారెంట్లు మూసివేత‌.

క‌రోనా మ‌హ‌మ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో మ‌ళ్లీ ఐదు నెల‌ల క్రితం ఏ ప‌రిస్థితులు ఉన్నాయో అవి రిపీట్ అవుతున్నాయి. దీంతో ఆ యా ప్ర‌భుత్వాలు మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం యూకేలో ఇదే అమ‌ల‌వుతోంది.

యూకేలో ఇప్పుడు క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త వారంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1 ల‌క్షా 16 వేలు ఉండ‌గా.. ఇప్పుడు 2 ల‌క్షల 24 వేల‌కు చేరింది. వారం వ్య‌వ‌ధిలో ల‌క్ష‌కు పైగాపాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మ‌రింత ఎక్కువ అవుతుంద‌ని వైద్యులు అంచ‌నా వేస్తున్నారు. మొద‌ట్లో విజృంభించిన క‌రోనా ఆ త‌ర్వాత త‌గ్గిపోయింది.. మ‌ళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో కేసులు న‌మోదవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

అక్క‌డి హాస్పిట‌ల్స్ అన్నీ ఇప్పటికే పేషెంట్ల‌తో నిండిపోయాయి. అయితే అనూహ్యంగా పాజిటివ్ కేసుల్లో చిన్నారుల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని తెలిసింది. దీంతో ప్ర‌భుత్వం ఇంకా అప్ర‌మ‌త్త‌మైంది. వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోక‌కుండా ఉండేందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందులో ప్ర‌ధానంగా వైర‌స్ వ్యాప్తి చెందేందుకు కార‌ణం అయ్యే బార్లు, రెస్టారెంట్లు, ప‌బ్‌ల‌ను మూసివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త్వ‌ర‌లో పార్ల‌మెంటులో దీనిపై ప్ర‌క‌ట‌న చేయనున్నారు. యూకేలో క‌రోనాతో కోలుకున్న వారి సంఖ్యా చాలా త‌క్కువ‌గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here