చిరు ఒప్పుకుంటారా..

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఓకే చేశారా.. లేదా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అల్లు అర‌వింద్ ప్ర‌యోగం విజ‌య‌వంతం అవుతుందా అన్న డౌట్ వ‌స్తోంది. ఇంత‌కీ ఏంటిది అనుకుంటున్నారా.. వెబ్ సిరీస్‌.

మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర‌వింద్ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంత‌వ‌ర‌కు క్లారిటీ లేదు. చిరంజీవితో దాదాపు 50 ఎపిసోడ్‌లు ఉండే వెబ్ సిరీస్ అని ఇండ‌స్ట్రీలో టాక్ ఉంది. అల్లు అర‌వింద్ ఇటీవ‌లె ఆహా యాప్ కోసం బాగా ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో అంద‌రూ ఓటీటీల‌వైపే అడుగులు వేస్తున్నారు. మునుపెన్న‌డూ లేని విధంగా దీనిపై ఫోక‌స్ పెట్టారు. ఇక అభిమానులు సైతం స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకొని ఓటీటీలో సినిమా చూద్దాంలే అన్న‌ట్లు క‌నిపిస్తున్నారు. దీన్ని అవ‌కాశంగా మ‌లుచుకోవ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ‌దైన శైలిలో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక అల్లు అర‌వింద్ కూడా మెగాస్టార్‌తో వెబ్ సిరీస్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్. అయితే చిరంజీవి ఇందుకు ఓకే చేశారో లేదో తెలియ‌దు. ఇన్ని ఎపిసోడ్‌లు చేయ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. పైగా వెండితెర‌ను వ‌దిలి ఇలా వెబ్‌సిరీస్‌లు ఆయ‌న చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారో లేదు. దీని గురించి ఎలాంటి స‌మాచారం అఫిషియ‌ల్‌గా రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here