సక్సెస్ వచ్చినా ఫైల్యూర్ వచ్చినా చిరు నే కలుస్తా – సునీల్

సునీల్ తెరపై ఎంత సున్నితంగా నవ్విస్తాడో .. బయట కూడా ఆయన అంతే సున్నితంగా అందరితోనూ వ్యవహరిస్తాడు. ముఖ్యంగా మెగాస్టార్ పట్ల ఆయనకి గల అభిమానం అప్పుడప్పుడు ఆయా వేదికలపై బయటపడుతూనే ఉంటుంది. అలాంటి సునీల్ ‘2 కంట్రీస్’ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ కూడా చిరంజీవి ప్రస్తావన తెచ్చాడు.” చిరంజీవి గారంటే నా కెంతో అభిమానం .. ఆయనంటే ఎంతో ఆరాధన భావం.
నాకు సక్సెస్ వచ్చినా .. ఫెయిల్యూర్ వచ్చినా ముందుగా ఆయన దగ్గరకే వెళతాను. ఎందుకంటే ఆయన నాకు ఓ ధైర్యం. సక్సెస్ వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతాయి. అలాగే అపజయం ఎదురైతే ‘ఫర్లేదు సునీల్ నటుడిగా నువ్ ఫెయిల్ కాలేదు .. ప్లాప్స్ అందరికీ వస్తూనే ఉంటాయి’ అంటూ ధైర్యం చెబుతారు. నేను ఈ రోజున ఇంత బాగా డాన్స్ చేయగలగడానికి స్ఫూర్తి కూడా ఆయనే’ అంటూ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here