గోవుల‌కు పూజ చేసిన ముఖ్య‌మంత్రి… ఎందుకో తెలుసా..

గోవుల‌కు ముఖ్య‌మంత్రి పూజ‌లు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇది జ‌రిగింది. మ‌ధ్య‌ ప్రదేశ్‌లో ఆవుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గం తొలి సమావేశం ఆదివారం జరిగింది. గోపాష్టమి సందర్భంగా ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించారు.

గోవు మంత్రివర్గానికి ముఖ్యమంత్రి చౌహాన్ నేతృత్వం వహిస్తున్నారు. హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, అటవీ శాఖ మంత్రి విజయ్ షా, వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి మహేంద్ర సింగ్ శిశోడియా, పశు సంవర్థక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ ఈ మంత్రివర్గంలో ఉన్నారు. ఆవుల పరిరక్షణకు ఈ మంత్రిత్వ శాఖలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలన్న లక్ష్యంతో ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.

ఆవు పిడకల వినియోగం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని గతంలో చౌహాన్ చెప్పారు. ప్రస్తుతం గో-కాష్ట్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆవు పాల నుంచి తయారయ్యే ఇతర ఉత్పత్తులను కూడా మార్కెట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,200 గోశాలలు ఉన్నాయి. మరొక 2,400 గోశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలావుండగా ముఖ్యమంత్రి చౌహాన్ ఆదివారం గోపాష్టమి సందర్భంగా గో పూజ చేశారు. ఆవుకు హల్వా రోటీ తినిపించారు. నంద మహారాజు తన కుమారులైన శ్రీకృష్ణుడు, బలరాములకు బృందావనంలోని ఆవుల సంరక్షణ బాధ్యతను అప్పగించిన రోజును గోపాష్టమిగా జరుపుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here