`చెలియా` సెన్సార్ పూర్తి…ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్‌

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌, శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌ద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం `చెలియా`. కార్తీ, అదితిరావ్ హైద‌రీ జంట‌గా న‌టించారు.  గీతాంజ‌లి, రోజా నుండి ఓకే బంగారం వ‌ర‌కు ప‌లు క్యూట్, బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీస్‌ను ప్రేక్ష‌కులకు అందించిన ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న మ‌రో ఇన్‌టెన్‌సివ్ ల‌వ్‌స్టోరీ `చెలియా`. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం.  ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత సార‌థ్యంలో వ‌చ్చిన పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.
కార్తీ, అదితిరావు హైద‌రీ అంద‌మైన ప్రేమ జంట‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్‌, ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, మ‌ణిర‌త్నం టేకింగ్‌తో `చెలియా` ప్రేక్ష‌కుల‌కు మ‌ర‌చిపోలేని మెమ‌రీగా నిలిచిపోవ‌డం ఖాయం అని నిర్మాతలు దిల్‌రాజు,శిరీష్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here