చంద్ర‌బాబూ కాస్త వెన‌కా ముందూ చూసుకోవాలి క‌దా..

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైంది. కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది క‌దా అన్న స‌మాధానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో రామ‌చంద్ర అనే వ్య‌క్తిపై దాడి ఘ‌ట‌న‌లో చంద్ర‌బాబు స్పందించిన తీరు.. ఇప్పుడు వారికే షాక్ ఇచ్చేలా ఉండ‌టంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

జ‌డ్జి రామ‌కృష్ణ సోద‌రుడు రామ‌చంద్ర‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో ఇప్పుడు చంద్ర‌బాబు గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దాడి జ‌రిగిన విష‌యంపై చంద్ర‌బాబు స్పందిస్తూ దాడి వెనుక వైసీపీ ఉందని ఆరోపించారు. డీజీపీకి లేఖ కూడా రాశారు. అయితే దీనిపై పోలీసులు విచార‌ణ చేయ‌గా అస‌లు విష‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది. టిడిపి నాయ‌కుడు ప్ర‌తాప్ కారులో వెళ్తున్న స‌మ‌యంలో తోపుడు బండి వ్య‌క్తితో కారుకు దారి ఇవ్వాల‌న్నారు. అక్క‌డ తోపుడు బండి వ్య‌క్తికి, ప్ర‌తాప్‌కు వాగ్వివాదం జ‌రగ్గా.. రామ‌చంద్ర స్పందించారు.

దీంతో ప్ర‌తాప్‌తో పాటు కారులో ఉన్న మ‌రో ముగ్గురు రామ‌చంద్ర‌పై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ప్ర‌తాప్‌ను అరెస్టుచేయ‌గా విష‌యం బ‌య‌ట‌కు తెలిసింది. రామ‌చంద్ర ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని అక్కడ గొడ‌వ జ‌రిగిన స‌మ‌యంలోనే ఇలా జ‌రిగింద‌ని తెలిపారు. దీంతో వైసీపీపై నింద‌లు వేసిన ప్ర‌తిప‌క్షాల‌కు మాట్లాడ‌టానికి ఆస్కారం లేకుండా పోయింది. కాగా ఈ విష‌యంపై డీజీపీ చంద్రబాబుకు రిట‌ర్న్ లేఖ రాశారు. రామ‌చంద్ర‌పై దాడి కేసులో విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు. దాడి చేసిన ప్ర‌తాప్ రెడ్డి టిడిపి కార్య‌క‌ర్త అని వివ‌రించారు. ఏవైనా ఆదారాలు ఉంటే ఇవ్వాల‌ని కోరారు. దీంతో చంద్రబాబు లేఖ‌కు స్ప‌ష్టంగా డీజీపీ స‌మాధానం ఇచ్చార‌ని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here