చంద్ర‌బాబు భ‌యం దీనిగురించేనా..

ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుకు స్థానిక భ‌యం ప‌ట్ట‌కుందా అంటే అవుననే అనిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన చంద్ర‌బాబు నాయుడుకు క‌రోనా కార‌ణంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ర‌ద్దై పెద్ద ప‌నే అయ్యింద‌ని అంతా అనుకుంటున్నారు. లేదంటే ఈ ఎన్నిక‌ల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘోర ఓట‌మి పాల‌య్యేద‌ని.. ఇలా జ‌ర‌గ‌కుండా ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌టం టిడిపికి పెద్ద ప్ల‌స్ అంటున్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో మ‌రోసారి స్థానిక సంస్థల ఎన్నిక‌ల టాపిక్ వ‌చ్చింది. ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశం నిర్వ‌హించిన త‌ర్వాత ప‌రిస్థితులు ఇంకా వేడెక్కాయి. ఎందుకంటే స‌మావేశంలో అన్ని పార్టీలు పాల్గొన్న‌.. వైసీపీ మాత్రం పాల్గొన‌లేదు. దీంతో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అధికార పార్టీకి ఇష్టం లేద‌ని క్లియ‌ర్ గా తెలుసు. అయితే స‌మావేశంలో ఎన్నిక‌లు నిర్వ‌హించాలా వ‌ద్ద అన్న టాపిక్ కంటే ఎన్నిక‌లు నిర్వ‌హించినా మొద‌టి నుంచి నిర్వహించాల‌న్న డిమాండ్ బాగా వినిపించింది.

ఎందుకంటే గ‌తంలో స్థానిక సంస్థ‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఏక‌గ్రీవాలు అయ్యాయి. ఇక ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే రాష్ట్రంలో మ‌రోసారి వైసీపీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ చివ‌రిలో ఎన్నిక‌లు నిలిచిపోయాయి. అదే ఇప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించినా వైసీపీ అదే మెజార్టీతోనే గెలుస్తుంది. అయితే ఇది న‌చ్చ‌ని ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ర‌ద్దు చేసి మ‌ళ్ల ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న రీతిలో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని తెలుస్తోంది. అప్పుడు వైసీపీ చేసుకున్న ఏక‌గ్రీవాల‌న్నీ తొల‌గించాల‌ని యోచిస్తోంది. కానీ ఏం జ‌రిగినా రాష్ట్రంలో వైసీపీ భారీ విజ‌యం సాధిస్తుంద‌ని వైసీపీ నేత‌లు ధీమాగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here