తాజాగా ప్రకటించిన బడ్జెట్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆంధ్రరాష్ట్రానికి చెందిన వామపక్ష పార్టీల బందుకు పిలుపునిచ్చారు. ఈ బంద్ లో వైఎస్సార్ సీపీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిమిత్తం పాల్గొనడం జరిగింది.రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేపథ్యం లో బంద్ కు పిలుపునిచ్చారు వామపక్ష పార్టీలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా మద్దతు పల్కింది.
ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పాదయాత్రకు కూడా విరామం ప్రకటించారు.దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రేపు విపక్షాలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.అయితే ఈ క్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మీద మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ రాష్ట్రంలో కాకుండా దమ్ముంటే ఢిల్లీలో కోట్లడాలని జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరారు.