లైంగిక నేరాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు..

దేశంలో పెరిగిపోతున్న మ‌హిళ‌ల‌పై నేరాల‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు తీసుకుంది. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ఏం చేయాల‌ని పోలీసులు ఎలా ముందుకెళ్లాల‌న్న దానిపై స్ప‌ష్ట‌మైన విధానాన్ని చెప్పింది. నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే పోలీసుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్రం తెలిపింది.

ఉత్త‌ర ప్ర‌దేశ్ హ‌థ్ర‌స్ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వ‌చ్చింది. బాదితురాలి కుటుంబ స‌బ్యుల‌కు కూడా అత్యంత భ‌ద్ర‌త క‌ల్పించారు. దీంతో కేంద్రం లైంగిక నేరాల‌పై కఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌నుకుంటోంది. ఈ మేర‌కు ముందుగా పోలీసులు ఏం చేయాల‌న్న దానిపై క్లారిటీ ఇచ్చింది. లైంగిక దాడుల కేసుల్లో ఎఫ్‌.ఐ.ఆర్ త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేయాల‌ని పేర్కొంది.

అంతేకాకుండా 60 రోజుల్లోపు ద‌ర్యాప్తు పూర్తి చేయాల‌ని చెప్పింది. అప్పుడు మ‌నం బాదితుల‌కు న్యాయం చేసిన‌ట్లు అవుతుంద‌ని కేంద్రం భావిస్తోంది. కాగా ఈ ద‌ర్యాప్తులో రాష్ట్ర పోలీసుల‌కు స‌హ‌కారం అందించేందుకు ఇన్వెస్టిగేష‌న్ ట్రాకింగ్ సిస్టం ఫ‌ర్ సెక్సువ‌ల్ అఫెన్సెస్ పేరుతో ఓ ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ను కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తెచ్చింది. బాదితురాలి మ‌ర‌ణ వాంగ్మూలాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కేంద్ర హోం శాఖ తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చింది.

పోలీసులు నిబంధ‌న‌లు పాటించాల్సిందేన‌ని తెలిపింది. లేదంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది. ఈ మార్గద‌ర్శ‌కాల‌తో రాష్ట్ర ప‌రిధిలో నేరానికి సంబంధించిన విచార‌ణ‌ను కేంద్రం కూడా ప‌ర్య‌వేక్ష‌ణ చేసే ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా కేసు పురోగ‌తి తొంద‌ర‌గా అయ్యేందుకు వీలు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here