జగన్ ని ఎందుకు వదిలేసా అంటే .. బుట్టా రేణుక సమాధానం ఇదే

తన నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకోవడం, ప్రజా సంక్షేమాన్ని మరో మెట్టు ఎక్కించడం కోసమే తెలుగుదేశం పార్టీలో చేరినట్టు బుట్టా రేణుక వెల్లడించారు. తన నిర్ణయం వెనుక పార్టీ ఫిరాయింపులు, ఎవరినో మోసం చేయడాలూ లేవని, టీడీపీలో చేరిన తరువాత ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ రేణుక వ్యాఖ్యానించారు.  వైఎస్ఆర్ సీపీని వీడటం వెనుక ఎటువంటి రాజకీయ కారణాలూ లేవని, తన కార్యకర్తల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
చంద్రబాబు పాలనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, ఆర్థికంగా ఎంతో వెనుకబడిన కర్నూలు జిల్లాలో అభివృద్ధికి చంద్రబాబు సహకరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. నిధులు లేకున్నా సమతుల్యతను పాటిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న నేత చంద్రబాబని కొనియాడారు. ఉన్నత ఆశయాలు, గొప్ప ఆలోచనలతో సాగుతున్న ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here