బన్నీకి సర్ప్రైజ్ ఇచ్చిన ‘రౌడీ’.. !

అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ గా మారాడు హీరో విజయ్ దేవరకొండ. తనదైన మేనరిజంతో యువతను ఆకట్టుకున్న విజయ్ కేవలం సినిమాల తోనే కాకుండా తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ ‘ రౌడీ వేర్’తో.. పాపులర్ అయ్యాడు. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా  ఉండే విజయ్ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాడు.

తాజాగా  మెగా హీరో అల్లు అర్జున్ కు ఓ గిఫ్ట్ ను ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు విజయ్. ఇంతకా గిఫ్ట్ ఏంటంటే… రౌడీ వేర్ బ్రాండ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీ షర్ట్, ట్రాక్, డిజైన్ మాస్క్ లను బన్నీకి పంపాడు. బన్నీ వాటన్నింటినీ ఒక ఫోటో తీసి… విజయ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. ఏదేమైనా… టాలీవుడ్ హీరోల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఆహ్వానించదగినది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here