బిగ్ బాస్ హౌజ్ లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ…ఈసారి వచ్చేదెవరంటే.? 

బిగ్ బాస్ సీజన్ 4..  ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. హౌజ్ మెట్స్ గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలు ఇలా ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెడుతోంది. ఇదిలా ఉంటే షో నుంచి ఇప్పటికే కళ్యాణి, సూర్య బయటకి రాగా కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం..  బిగ్ బాస్ హౌజ్ లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా జంప్ జిలానీ మూవీ హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ని షో లోకి పంపించనున్నారని సమాచారం. మరి స్వాతి రాకతో బిగ్ బాస్ షోలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి. ఇక స్వాతి కెరీర్ విషయానికొస్తే..  2013లో వచ్చిన ‘బ్రేకప్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది..  జంప్ జిలాని, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, చిత్రంగద సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. వీటితో పాటు తమిళంలోనూ రెండు చిత్రాల్లో నటించిందీ బ్యూటీ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here