మూడో సారి ఆ హీరోయిన్‌కే జైకొట్టిన బాల‌య్య‌..

హీరో నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా విష‌యంపై ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. ఆయన న‌టించే చిత్రంలో స్నేహను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇదే నిజ‌మైతే వీరి జంట‌కిది ముచ్చ‌ట‌గా మూడో సినిమా అవుతుంది.

బాల‌కృష్ణ హీరోగా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నివాస్ ఓ చిత్రాన్ని తీస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్ కూడా విడుద‌లైంది. ఈ  సినిమాలో బాల‌య్య దిపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో సీనియ‌ర్ బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించేందుకు స్నేహ‌ను ఓకే చేశార‌ని టాక్ న‌డుస్తోంది.

స్నేహ‌తో ఇప్ప‌టికే బాల‌కృష్ణ పాండురంగ‌డు, మ‌హార‌థిలో న‌టించారు. కాగా ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రి జోడీ రాబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమాలో బాల‌కృష్ణ మ‌రోపాత్ర‌కు కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేస్తార‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో బాల‌య్య అఘోరా పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.  ఈ నేప‌థ్యంలో సినిమా షూటింగ్ హిమాల‌య ప‌ర్వతాల్లో జ‌ర‌గాల్సి ఉండ‌గా క‌రోనా సంద‌ర్బంగా నిలిచిపోయింది. అయిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌లోనే సినిమా షూటింగ్ చేయాల‌ని యూనిట్ భావిస్తోంద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here