ఖైదీ రికర్డులు లెఫ్ట్ లెగ్ తో తన్నేసిన ప్రభాస్

కం బ్యాక్ సినిమాతో అందరికీ చుక్కలు చూపించిన చిరంజీవి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంతో నిరూపించాడు. ఒకే ఒక్క దెబ్బతో వంద కోట్లు సాధించి నూట ఐదు కోట్ల షేర్ వసూళ్ళ తో అదరహో అనిపించాడు. బాహుబలి 1 తప్ప ఎవ్వరూ సాధించలేని ఫీట్ ని చిరు ప్రూవ్ చేసి చూపించగా ఇప్పుడు అదే రికార్డ్ ని బాహుబలి రెండో భాగం లెఫ్ట్ లెగ్ తో తన్నేసింది. విడుదల అయిన ఐదే ఐదు రోజులలో చిరు సినిమా ఖైదీ రికార్డులు దాటేసింది బాహుబలి . నూట ఆరు కోట్ల షేర్ ని సాధించిన బాహుబలి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రికార్డ్ సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా తొలి ఐదు రోజుల్లో బాహుబ‌లి-2 షేర్స్ వివ‌రాలు..
నైజాం-రూ.28.42  కోట్లు
వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.13.48 కోట్లు
సీడెడ్‌ (రాయలసీమ)-రూ.18.55 కోట్లు
తూర్పు గోదావ‌రి-రూ.11.82 కోట్లు
ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.8.66 కోట్లు
గుంటూరు-రూ.11.82 కోట్లు
కృష్ణా- రూ.8.22 కోట్లు
నెల్లూరు-రూ.5.04 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్- రూ106.37 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here