ప్రభాస్ ని బావా పెళ్లి చేసుకో అనేసిన మోహన్ బాబు ..

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు దేశవ్యాప్తంగా ప్రసంసల తో రాజమౌళి అతని బృందం ఫుల్ బిజీ గా ఉన్నారు. తాజాగా సీనియర్ హీరో మోహన్ బాబు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. బాహుబలి సినిమా మీద ఆయన చేసిన ప్రశంసలు అందరి దృష్టి నీ ఆకట్టుకున్నాయి.
“‘‘ప్రియమైన రాజ‌మౌళీ.. భారతదేశంలో తెలుగు ప్రజలున్నారని అన్నయ్య ఎన్టీ రామారావు గారి ద్వారా ప్రపంచానికి  తెలిసింది. ఇప్పుడు  ఒక గొప్ప తెలుగు దర్శకుడున్నాడని బాహుబలి ద్వారా నువ్వు ప్రపంచానికి చాటి చెప్పావ్. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని అర్ధాంగి ‘రమ’ ప్రేమానురాగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను’’
‘‘ప్రియమైన  ప్రసాద్..  బాహుబలి విజయంతో ‘విశ్వ విజయేంద్ర ప్రసాద్’ గా సార్థక నామధేయుడివి అయ్యావ్. ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను’’
‘‘బావా బాహుబలి..పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే ‘రాజులు’ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ’’
‘‘కీర్.. మరకతమణిగా.. ఎంఎం క్రీమ్ గా.. కీరవాణిగా.. ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడవై పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ సాగాయి మోహన్ బాబు ట్వీట్ లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here