తొలి భారతీయ వెయ్యి కోట్ల సినిమా … మన తెలుగు సినిమా

భారతీయ చలన చిత్ర బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్నీ ఇప్పుడు చిన్నబోయాయి కాదు కాదు మూగ బోయాయి. బాహుబలి రెండవ భాగం సినిమా వెయ్యి కోట్లు కలక్ట్ చేసిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర ని సృష్టించింది. ఈ వారధ ఇప్పుడు అధికారికం  అయ్యింది. ట్రేడ్ పండిట్ రమేష్ బాలా ఈ విషయం కన్ఫిరం చేసారు కూడా . ఇండియా లో రూ. 800 కోట్లు, విదేశాల్లో రూ. 200 కోట్ల కలెక్షన్లను దాటేసిందని, ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
సోషల్ మీడియా లో వెయ్యి కోట్ల బాహుబలి అని అప్పుడే ట్రెండ్ కూడా మొదలు పెట్టేసారు ప్రభాస్ ఫాన్స్. రాజమౌళి కి సూపర్ రెస్పాన్స్ వస్తూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అందరూ. ఈ టైం లో ప్రభాస్ యూ ఎస్ లో హాలిడే ట్రిప్ మీద వెల్లడం , రాజమౌళి యూకే కి వెళ్ళడం విశేషం. ప్రభాస్ ని కలుద్దాం అనుకున్న ఫాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here