మొబైల్స్ రావ‌డం వ‌ల్ల‌ అత్యాచారాలు పెరిగిపోతున్నాయా..

టెక్నాల‌జీ ఎంత పెరిగినా దాన్ని మంచి కోసం వాడాలే త‌ప్ప చెడు కోసం కాదు. చెడ్డ ప‌ని కోసం మ‌నం ఉప‌యోగించ‌న‌ప్పుడు అది స‌మాజానికి ఎంతో కీడు చేస్తుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ లేనివారు ఎవ్వ‌రూ లేరు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలోనే ఈ మొబైల్స్‌పై నెగిటివ్ టాక్ ఎక్కువైంది.

అత్యాచారలు పెరగడానికి కారణం మొబైల్ ఫోన్లేనని రాష్ట్రీయ జనతా దళ్ నేత శివానంద్ తివారీ అన్నారు. మొబైల్ ఫోన్లలో నీలి చిత్రాలు అందుబాటులో ఉండడం వల్ల.. వాటిని చూస్తూ యువత ఆలోచనా విధానం మారిపోతుందని, అందుకే ఇలాంటి దారుణాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యాచార ఘటనల గురించి వినడం చాలా అరుదని, ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు జరగడానికి మొబైల్ ఫోన్లే కారణమని ఆయన అన్నారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా అనే గిరిజన ప్రాంతంలో ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. మార్కెట్‌కు వెళ్లి వస్తున్న భార్యాభర్తల్ని అడ్డుకున్నారు. అనంతరం భర్తను నిర్బంధించి భార్యపై అత్యాచారం చేశారు. ‘‘ఇలాంటి వాటి గురించి ఎవరూ ఊహించలేరు. గిరిజన ప్రాంతాల్లో అత్యాచారాలు జరగడమేంటన్నారు. మొబైల్ ఫోన్లలో ఐటమ్ డాన్స్, ప్రకటనలు, పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఎక్కువై పోయి యువత ఆలోచనా విధానం మారిపోతోందన్నారు. అయితే ఈ విష‌యంలో ప‌లువురు స‌పోర్టు చేస్తున్నా మ‌రికొంద‌రు విభేదిస్తున్నారు. ఫోన్లు రావ‌డం మామూలే అయినా స‌మాజంలో పిల్ల‌ల్ని పెంచే విధానం మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here