అక్క‌డ నిజంగా వ‌జ్రాలు దొరు‌కుతున్నాయా.. ప్ర‌భుత్వం ఏమంటోంది..

ఆ ప్రాంతాంలో వ‌జ్రాలు దొర‌కుతున్నాయ‌ని ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. దీనిపై ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీంతో ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం దిగివ‌చ్చి అక్క‌డ వ‌జ్రాలు ఉన్నాయో లేదో స‌ర్వే చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

నాగాలాండ్‌లో ఓ రైతుకు వజ్రం లభించింది. దీంతో నాగాలాండ్ లో వజ్రాలు ఉన్నాయని ప్రజలు తవ్వుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో నాగాలాండులో వజ్రాల నిక్షేపాల గురించి సర్వే చేయాలని నాగాలాండ్ సర్కారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందాన్ని ఆదేశించింది. నాగాలాండులోని అబెంటుంగ్ లోథా, లాంగ్రికాబా, కెనియెలో రెంగ్మా, డేవిడ్ లౌపెని ప్రాంతాల్లో వజ్రాల నిక్షేపాలపై సర్వే జరిపి నివేదికను సమర్పించాలని నాగాలాండ్ గనులు, భూగర్భవనరుల శాఖ డైరెక్టరు ఎస్ మనేన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను ఆదేశించారు.

వాచింగ్ ప్రాంతంలో విలువైన వజ్రాలు దొరుకుతున్నాయని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను పరిశీలించాలని సర్కారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను కోరింది. నాగాలాండ్ ప్రాంతంలో వజ్రాలు ఉన్నట్లు రికార్డులు లేనందున కొంతమంది గ్రామస్థులు కనుగొన్న చిన్న స్ఫటికాలు అసలు వజ్రాలు అని భావిస్తున్నారని, కాని అవి వజ్రాలు కావని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటున్నారు. నవంబరు 30 వతేదీన భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం నాగాలాండ్ లో పర్యటించి వజ్రాల నిక్షేపాలను దర్యాప్తు చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here