జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా…? ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ భార్య లెజినోవా మళ్లీ గర్భవతి అని తెలుస్తోంది. కాగా పవన్, లెజినోవా దంపతులకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. ఆమె పేరు పోలేనా.
పవన్‌కు మూడో భార్యయైన లెజినోవా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని వినిపిస్తోంది.
కాగా పవన్ కల్యాణ్ కు ఇంతకుముందు రేణుదేశాయ్ తో ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె ఆద్యా, కొడుకు అఖిరా ఇద్దరూ ఇప్పుడు పుణేలో తల్లితో కలిసి ఉంటున్నారు. రెండో భార్య అయిన నటి రేణుదేశాయ్‌తో విడిపోయిన తర్వాత లేజినోవాను పవన్ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఆద్యా బర్త్‌డేలో పవన్ పూణే వెళ్లి స్నేహితలతో సరదాగా గడిపారు.
తాజాగా సోషల్ మీడియాలో పవన్ మళ్లీ తండ్రి కాబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. పవన్ వైపు నుంచి దీనిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.