జంతువులకూ సోకుతున్న కరోనా..?

ఇప్పుడు కరోనా మహమ్మారితో  ప్రపంచ దేశాల దేశాలు వణికిపోతున్నాయి. రోజు రోజుకు విస్తరిస్తున్న ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఈ లక్షణాలు కొన్ని జంతువులలో కూడా గుర్తించారు.

USA కరోనా వైరస్ బారిన పడిన తొలి కుక్క చనిపోయింది. జంతువులలో ప్రపంచంలోనే తొలిసారిగా USAలోని రాబర్ట్ అనే వ్యక్తి దగ్గర ఉన్న జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఏడేళ్ళ కుక్కకు కరోనా సోకింది. అయితే ఇటీవల ఆ కుక్క మరణించినట్టు నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ వెల్లడించింది. USAలో ఈ కుక్క తరువాత ఒక పులి, ఒక సింహం, 10 పిల్లులు, 12 కుక్కలకు కరోనా సోకినట్టు సమాచారం. USA లోనే కాక ఇతర దేశాలలో కొన్ని జంతువులలో ఈ లక్షణాలు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here