వెబ్ సిరీస్ లో అఖిల్..?

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ భారిన పడటం తో లాక్ డౌన్ అమలు లోకి వచ్చింది. దీనివల్ల వెబ్ సిరీస్ లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇంట్లోంచి కదలలేని పరిస్థితి కాబట్టి అందరు ఓటీటీ  ప్లాటుఫార్మ్లో విడుదలైన మూవీస్ మీద ఎక్కవ సమయం వెచ్చిస్తున్నారు .ఇపుడు అన్ని కూడా దాదాపు ఆన్లైన్ ద్వారా నే విడుదల అవుతున్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్ ల పై అఖిల్ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

అక్కినేని కుటుంబం నుండి సమంత ది ఫ్యామిలీ మాన్ 2 లో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే తరహా లో బాలీవుడ్ లో ఒక క్రేజీ వెబ్ సిరీస్ లో నటించేందుకు అఖిల్ కి ఒక అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అందులో రాక్ స్టార్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం లో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here