ఇకనుండి అమేజాన్ ఫార్మ‌సీ కూడా..

అమేజాన్ త‌న వ్యాపార పంథాను విస్త‌రిస్తోంది. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌న వ్యాపారాన్ని మెరుగుప‌రుచుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అమేజాన్ కొత్త‌గా ఆన్‌లైన్‌లో మందులు స‌ర‌ఫ‌రా చేయ‌నుంది.

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమేజాన్ ఇప్పుడు అమేజాన్ ఫార్మ‌సీని ప్రారంభించ‌బోతోంది. ఈ మేర‌కు ఆసంస్థ ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ‌, లాక్ డౌన్‌ల నేప‌థ్యంలో మెడిక‌ల్ రంగంలో మంచి డిమాండ్ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా మందుల‌ను ఆన్‌లైన్ ద్వారా సర‌ఫ‌రా చేయాల‌ని అమేజాన్ నిర్ణ‌యించింది.

బెంగ‌ళూరులో అమేజాన్ ఫార్మసీని ప్రారంభించిన‌ట్లు అమేజాన ప్ర‌క‌టించింది. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన నేప‌థ్యంలో త‌మ సేవ‌లు ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌గా ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను స‌కాలంలో తీర్చాల‌న్న ఉద్దేశంతో ఇలా ముందుకు వెళుతున్న‌ట్లు తెలిపింది.

దీని ద్వారా వినియోగదారుల‌కు సాదార‌ణ వైద్య ప‌రిక‌రాలు, ఆయుర్వేద మందుల‌తో పాటు వైద్యుల డిస్క్రిష్ష‌న్ ప్ర‌కారం మందులు కూడా స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని పేర్కొంది. లాక్‌డౌన్ త‌ర్వాత వైద్య రంగంలో చాలా మార్పులు వ‌చ్చాయి. మొబైల్‌లోనే డాక్ట‌ర్లతో మాట్లాడుతూ వైద్య స‌హాయం తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అమేజాన్ ఫార్మ‌సీకి మంచి ఆద‌ర‌ణ ల‌భించే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here