బిగ్ బాస్ హౌస్ వాళ్ళిద్దరి కీ కలిసిర్ రాలేదు .. అట్టర్ ప్లాప్స్

స్టార్ మా ఛానల్ లో వస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు సూపర్ హిట్ షో గా మారింది. బుల్లితెర ప్రేక్షకులని ఈ షో ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. వీకెండ్స్ లో ఈ ప్రోగ్రాం కి హోస్ట్ గా వస్తూ తారక్ అలరిస్తూ ఉంటె వారం మొత్తం ఇంటి సభ్యులు తమ టాలెంట్ తో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రాం లో తమ తమ సినిమాలని కూడా ప్రోమోట్ చేసుకునే దిశగా ఈ షో అవకాశం ఇస్తోంది.

 

నేనే రాజు నీన్ మంత్రి కోసం రానా దగ్గుబాటి రాగా ఆనందో బ్రహ్మ సినిమా టైం లో తాప్సీ విచ్చేసింది. ‘అర్జున్ రెడ్డి’ సమయంలో విజయ్ దేవరకొండ ‘బిగ్ బాస్’ హౌస్ కి వెళ్లారు. ఈ మూడు సినిమాలు హిట్ కావడంతో, విడుదలకి ముందు ఆయా హీరోలు ‘బిగ్ బాస్’ హౌస్ కి వెళ్లడమనేది సెంటిమెంట్ గా మారింది. అయితే ఆ తరవాత వచ్చిన అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయి కోసం బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినా ఆ సినిమా ప్లాప్ గా మిగిలింది.

ఇక బిగ్ బాస్ హౌస్ సెంటిమెంట్ వర్క్ అవ్వని మరొక హీరో సునీల్ .. అతని కొత్త చిత్రం ఉంగరాల రాంబాబు నిన్ననే విడుదల అయ్యి  అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here