నాకు పేరు రాలేదని తెలుసు: ప్రభాస్

బాహుబలి కోసం దాదాపు తన కెరీర్ ని మొత్తం అంకితం చేసాడు హీరో ప్రభాస్ .. ఏ హీరో కూడా తన కెరీర్ లో వేరే సినిమా లేకుండా నాలుగేళ్ల సమయం మొత్తం వెచ్చించాడు అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఇంటర్నేషనల్ గా ప్రభాస్ కి అంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయా అంటే డౌట్ అనే చెప్పాలి. ప్రభాస్ కంటే ఎక్కువగా బాహుబలి విషయం లో రాజమౌళి కే పేరు దక్కింది అనేది అందరూ ఒప్పుకునే నిజం.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ తనకి పేరు ముఖ్యం కాదు అనీ పనిని ఎంజాయ్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్ అంటున్నాడు ప్రభాస్. తాను ఎంజాయ్ చేయలేని పేరు, ప్రతిష్ఠలను ఏం చేసుకోవాలని ప్రభాస్ ప్రశ్నించాడు. ప్రస్తుతానికి సుజీత్ సినిమాలో నటిస్తున్నానని ప్రభాస్ తెలిపాడు. ” అదే కథ తో ఇంటర్నేషనల్ సినిమా తీసి మీరే హీరోగా పెడితే చేస్తారా ? ” అంటే ” లేదు ఆ కథ తో వేరే ఎవరు వచ్చినా లక్ష కోట్ల బడ్జెట్ అయినా నేను చేయను అన్నాడు “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here