మోసం చేసారు నాన్నా – అఖిల్ ట్వీట్ సంచలనం

‘సారీ రా అఖిల్.. ఈ సాంగ్‌ విజువ‌ల్స్ విడుద‌ల చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నా, నువ్వు ఇంకా ఫాస్ట్ కావాల్సి ఉంది’ అంటూ అఖిల్ కొత్త సినిమా ‘హ‌లో’లోని ఓ పాట‌కు సంబంధించిన విజువ‌ల్స్‌ను విడుద‌ల చేశారు అక్కినేని నాగార్జున‌. ఈ సినిమాలో ఇంట్లో జ‌రుగుతోన్న ఓ వేడుక సంద‌ర్భంగా ఈ పాట‌ను పాడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో అఖిల్ డ్యాన్స్ తో అద‌ర‌గొట్టేశాడు.

ఒక నిమిషం 18 సెక‌న్‌ల పాటు ఉన్న‌ నాగార్జున పోస్ట్ చేసిన‌ ఈ వీడియోపై స్పందించిన అఖిల్.. ‘హాహాహాహా ఏమిటీ చీటింగ్‌? ఏదేమైనా ప్ర‌తి ఒక్క‌రూ ఈ వీడియోను ఇష్ట‌ప‌డ‌తారు’ అని పేర్కొన్నారు. వీరి సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.. ఈ వీడియో మీరూ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here