చైనాను ఎదుర్కోలేరు, క‌రోనాను వెళ్ల‌గొట్ట‌లేరు కానీ ప్ర‌తాపం మాపై చూపిస్తున్నారు..

రాజ్య‌స‌భ‌లో 8 మంది ఎంపీలను స‌స్పెండ్ చెయ్య‌డంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. దేశంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల్లో ఏమీ చెయ్య‌లేని కేంద్ర ప్ర‌భుత్వం వేరే విష‌యాల్లో చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌లు వివాదాస్ప‌దంగా మారుతున్నాయి.

దేశంలో క‌రోనా విజృంభిస్తుంటే బీజేపీ గెంటేయ‌లేక పోతోంది, చైనా స‌రిహ‌ద్దులో ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతుంటే ఏం చెయ్య‌లేక‌పోతోంది కానీ 8 మంది ఎంపీల‌ను మాత్రం స‌స్పెండ్ చేసింద‌ని బీజేపీపై కాంగ్రెస్ మండిప‌డింది. ఆ పార్టీ నేత అహ్మ‌ద్ ప‌టేల్ సీరియ‌స్ అయ్యారు. అక్కడ ఏం చెయ్య‌లేని వారు ఇక్క‌డ శ‌క్తినంతా త‌మ‌పై ఉప‌యోగిస్తూ స‌భ నుంచి బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని వ్యంగాస్త్రాలు విసురుతున్నారు.

వ్య‌వ‌సాయ బిల్లుల ఓటింగ్ స‌మ‌యంలో స‌భలో గంద‌ర‌గోళం సృష్టించిన 8 మంది ఎంపీల‌ను రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై విప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నాయి. కాంగ్రెస్ స్పందిస్తూ బ‌ల‌వంతుల‌మ‌ని చెప్పుకున బీజేపీ ప్ర‌భుత్వం చైనాను, క‌రోనాను త‌రిమికొట్ట‌లేక‌పోయిందంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక సంక్ష‌భాన్ని ఎదుర్కోలేక‌పోతోంద‌న్నారు. కానీ రైతుల హ‌క్కుల కోసం నిల‌బ‌డిన ఎంపీల‌ను స‌స్పెండ్ చేసింద‌ని మండిప‌డుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here