వైజాగ్ బీచ్ లో సుందర భవనం ? రాజమౌళి అండ్ ఫామిలీ కోసం ?

చారిత్రాత్మక సూపర్ హిట్ తో జక్కన్న రాజమౌళి తనదైన శైలి లో సూపర్ విజయం సాధించి ఇండియా లో తానే పెద్ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అని నిరూపించుకున్నారు. ఇప్పుడు అందరూ మౌళి కొత్త ఇల్లు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇరవై ఎకరాలు కొన్నాడు అని టాక్ వచ్చిన రెండో రోజే ఆ ఫిగర్ వంద ఎకరాలు అనేసారు. దొనకొండ లో ఈ ఫార్మ్ హౌస్ ఉంటుంది అన్నవారు కూడా లేకపోలేదు. వైజాగ్ లో రాజమౌళి బృందం బాహుబలి పార్టీ చేసుకుంది , అయితే.. ఈ పార్టీ తర్వాత.. రాజమౌళి వైజాగ్ లో ల్యాండ్ కొనబోతున్నాడంటూ టాక్ వచ్చింది.

బీచ్ గెస్ట్ హౌస్ కట్టుకునేందుకు గాను.. వైజాగ్ పరిసరాల్లో కొన్ని ఎకరాలు కొనబోతున్నాడన్నది వీటి సారాంశం. మౌళి ఇన్నేసి ప్రాంతాలలో ఇన్నేసి ఇళ్ళు , స్థలాలు ఎందుకు కట్టేస్తారు ? జూబ్లీ హిల్స్ లో పెద్ద ఇల్లు లోనే ఉంటున్నారు ఆయన. మరి ఇవి పుకార్లా నిజాలా అనేది త్వరలో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here