ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎవ్వరో కాదు స్వయాన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్‌పాస్ తెలిపారు. కరోనా పరిస్థితుల్లో ప్రపంచం మరోసారి భారీ ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటోందని ఆయన వెల్లడించారు.
80 సంవత్సరాల క్రితం అంటే 1930ల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి సంక్షోభ పరిస్థితి ఏర్పడిందన్నారు. పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది పెద్ద విపత్తు అని ఆయన అన్నారు. ఊహించని ఆర్థిక సంక్షోభం రావడంతో రుణాల తీసుకొనే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు ఇది భారీగా దెబ్బతీస్తుందన్నారు.
ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ క్యాలెండర్ ఇయర్ లో ఆయా దేశాలకు భారీ వృద్ధి కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు రూపొందిస్తోందని వెల్లడించారు. పేద దేశాల్లో ప్రజలకు అదనపు సామాజిక భద్రత కలిగించే దిశగా ప్రపంచ బ్యాంకు కసరత్తు చేస్తోందన్నారు. కాగా భారత్‌లో కరోనా వచ్చినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పొచ్చు. పలు రాష్ట్రాలు అప్పులు తెచ్చుకుంటున్నాయి. తమకు అనుకూలమైన మార్గాల్లో రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
 
            