2019 ఎన్నికల నేపథ్యంలో ఇండియాటుడే-కార్వీ సంస్థలు సర్వే నిర్వహించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో….ఈ సర్వేలో అధికార తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలేటట్టు ఉంది. వచ్చేఎన్నికలలో తిరిగి అధికారం కైవసం చేసుకుందామనుకున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికలు చుక్కలు చూపించే టట్టున్నాయి. గత ఎన్నికలలో నెరవేర్చలేని హామీలు ప్రకటించి అబద్ధాలు చెప్పి అధికారం కైవసం చేసుకున్న చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మారు అని అంటున్నారు కొంతమంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఏపీలో అధికారం మారే అవకాశం ఉందని, చంద్రబాబుకు పోటా పోటీ మెజార్టీ సాదించడమే కష్టమని తేల్చింది. ప్రస్తుతం ఏపీ మంత్రులపై ఉన్న అవినీతి ఆరోపణలు, మహిళలపై టీడీపీ నేతల దాడులు. అలాగే అగ్రిగోల్డ్ వ్యవహారం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఇండియాటుడే-కార్వీ సంస్థలు తేల్చి చెప్పాయి. మరి ప్రభుత్వ వ్యతిరేకతను వైసీపీ తన వైపుకి ఎలా మార్చుకుంటుందో చూడాలి. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ ఈ సారి వచ్చే ఎన్నికలలో గెలవడానికి అవకాశాలు కొద్దిగా ఉన్నట్లు తెలుస్తోంది.