లేడీ సూపర్ స్టార్’కి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు..

నేడు టాలీవుడ్ లే సూపడీర్ స్టార్ విజయశాంతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా సోషల్ మీడియా వేదికగా విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

విజయశాంతి అంటే టాలీవుడ్లో చెరగని ఓ బ్రాండ్ నేమ్ ఉంది. ఆమె చేసిన సినిమాలు ఇప్పటికి సినీ ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాయి. సూపర్ స్టార్ కృష్ణ.. మెగాస్టార్ చిరంజీవి.. నటసింహం బాలయ్య.. కింగ్ నాగార్జున.. వెంకటేష్ ఇలా అందరి హీరోల సరసన హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి పెట్టింది పేరు. ఆమె చేసిన కర్తవ్యం.. ఒసేయ్ రాములమ్మ.. ప్రతిఘటన.. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక కొన్నేళ్ల క్రితం సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలలో సేవలందించి ప్రస్తుతం మళ్లీ సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. మహేష్ బాబు గతంలో ‘కొడుకు దిద్దిన కాపురం’ అనే సినిమాలో విజయశాంతితో నటించాడు. ఆ తర్వాత ముప్పై యేళ్ళ తర్వాత మళ్ళీ మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఈరోజు విజయశాంతి బర్త్డే కావడంతో మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ‘హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు. ఎల్లప్పుడూ ఆరోగ్యం సంతోషం మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మహేశ్ ట్వీట్ చేసాడు. దీనికి ఆమె ‘థ్యాంక్యూ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here