ఫామ్‌హౌస్ నుంచే పరిపలాన కొనసాగించనున్న కేసీఆర్..

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లోని సిబ్బందికి ఇప్పటి వరకూ ఇరవై మందికి పాజిటివ్‌గా తేలింది. వారం రోజులుగా.. ఒక్కొక్కరిలో లక్షణాలు బయటపడుతూండటంతో.. టెస్టులు చేశారు. కొంత మందికి.. లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయించుకున్నారు. మొత్తంగా.. ఇరవై మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకిన వారిలో పలువురు అవుట్‌ సోర్సింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో.. ప్రగతిభవన్‌ను అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు.

ఇప్పుడు ఇక పూర్తిగా ఫామ్‌హౌస్ నుంచే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఎక్కువగా ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నప్పటికీ.. అధికారిక సమీక్షలు మాత్రం..ప్రగతి భవన్‌లోనే నిర్వహించేవారు. ప్రెస్‌మీట్లు కూడా పెట్టేవారు. ఇటీవలి కాలంలో… కరోనా కేసులు పెరిగిపోవడంతో… ప్రెస్‌మీట్లు కూడా తగ్గించారు. గత మూడు రోజులుగా.. హైదరాబాద్‌లో లాక్ డౌన్ విధింపుపై.. మంత్రులు.. అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఏ నిర్ణయానికి రాలేకపోయారు. తెలంగాణలో కరోనా ప్రమాదకరంగా విస్తరిస్తోంది. హైదరాబాద్‌లోనే రోజుకు దాదాపుగా వెయ్యి కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది.

తెలంగాణలో వైరస్ నియంత్రణ విషయం ప్రభుత్వం పట్టనట్లుగా ఉంటోందని విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో.. నేరుగా సీఎం అధికారిక నివాసంలో కరోనా తిష్ట వేయడం.. ముఖ్యమంత్రి కూడా…ఫామ్‌హౌస్ నుంచే పాలన చేస్తూండటం… విపక్షాలకు విమర్శల దాడి చేయడానికి మరో అవకాశం కల్పించినట్లయింది. సహజీవనం చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ… అన్ని రకాల కరోనా చర్యలను లైట్ తీసుకుందని కాంగ్రెస్ , బీజేపీ నేతలు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here