భారీగా పడిపోయిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!

బంగారం ధర వెలవెలబోయింది. మరోసారి దిగొచ్చింది. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశం. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.

పసిడి వెలవెలబోతోంది. బంగారం ధర పడిపోతూనే వస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఊరట కలిగించే అంశం. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర తగ్గడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గింది. దీంతో ధర రూ.46,900కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.220 తగ్గుదలతో రూ.48,100కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.1090 పెరిగింది. రూ.49,600కు ఎగసింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,100కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.50,710కు క్షీణించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here