ఎల్జీ పాలిమర్స్ పై అంత ప్రేమ ఎందుకు…?

ఇదెక్కడి న్యాయమో చంద్రబాబు చెప్పాలి మరి. ఆయన ఎలాగూ చెప్పరు, ఎదుటి వారి మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుంటున్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు. మొత్తానికి విశాఖ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనను కూడా  రాజకీయం చేద్దామనుకున్న  బాబు తన మీద తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయం అనుభవం. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో అయితే ఏకంగా తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి బాబు అభివ్రుద్ధి అంతా తానే చేశానని చెప్పుకుంటారు. ఆ అభివ్రుధ్ధి మాటున జరిగిన అనర్ధాలకు మాత్రం తనకే బాధ్యత లేదంటారు.

1998 నుంచి ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదాలు జరిగితే చంద్రబాబు సీఎం గా నాడు ఎందుకు పట్టించుకోలేదు. ఇక జనవాసాల మధ్య ప్రమాదకర పరిశ్రమలు ఉండరాని ఇపుడు చెబుతున్న చంద్రబాబు 2015లోనే పాలిమర్స్ భారీ విస్తరణకు అనుమతులు ఎందుకు ఇచ్చారు, దాని వెనక ఉన్న ప్రేమ ఏంటి. అదే విధంగా సిం హాద్రి అప్పన్న భూములను సైతం దోచిపెట్టి ఎల్జీ  పాలిమర్స్ కి  ఇచ్చేంటంత ఉదారత చంద్రబాబుకు ఎందుకు వచ్చింది.

మొదట్లో దీని మీద వైసీపీ పెద్దగా  మాట్లాడలేదు. కానీ చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు అదే పనిగా వైసీపీనే గ్యాస్ లీకేజి ఘటనకు బాధ్యులను చేయాలని చూడడంతో తెర వెనక అసలు కధ విప్పాల్సివచ్చింది. దాంతో మొత్తం పాపానికి నాటి చంద్రబాబు సర్కార్ మూలకారణమని  వైసీపీ మంత్రులు ఆధారాలతో సహా తేల్చేశారు.

వీటికి చంద్రబాబు జవాబు చెప్పితీరాలని మంత్రి  కన్నబాబు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణవేత్తలు, మేధావులు ఏనాడో చెప్పినా కూడా వినక  పాలిమార్స్ ని జనవాసాల మధ్యనే  ఉంచి తన పాలన‌లో మేలు చేసిన చంద్రబాబు ఇపుడు తీరి కూర్చుని తమపైన విమర్శలు చేయడమేంటి అని మంత్రి అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు అండ్ కో రాజకీయం చేద్దామనుకుని తామే గోతిలో పడ్డారా.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here