హైదరాబాద్ లో మోడీ భార్య.. యాదృచ్ఛికమేనా?

హైదరాబాద్ పై రీసెంట్ గా.. బీజేపీ నాయకత్వం సీరియస్ గా కాన్సన్ ట్రేట్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలన్న టార్గెట్ తో.. అమిత్ షా ఎత్తులు వేస్తున్నారు. అవసరమైతే.. పొరుగు పార్టీల కీలక నాయకులను బీజేపీలో చేర్చుకుని.. పదవులు కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ పై ఇంతటి ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్న తరుణంలోనే.. ప్రధాని మోడీ భార్య యశోదా.. హైదరాబాద్ వచ్చారు.

ఆమె హైదరాబాద్ పర్యటన వెనక ఏదైనా మతలబు ఉండే ఉంటుందని.. అంతా అనుమానిస్తున్నారు. ఎన్నడూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడని యశోదా.. సడన్ గా హైదరాబాద్ రావడం వెనక.. బీజేపీ హస్తం ఉండి ఉండొచ్చని కొందరు డౌట్ పడుతున్నారు. వాస్తవానికి బీజేపీ నేతలు కానీ.. యశోదా బెన్ కానీ.. రాజకీయాలు మాట్లాడలేదు.

కానీ.. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ లాంటి సున్నిత ప్రాంతానికి వెళ్లడం.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోవడం.. ఇలా ఒకదానివెంట ఒకటి.. రాజకీయాలతో ఏమైనా ముడిపడి ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోంది. రాజకీయ నాయకులు కూడా ఈ పరిణామాలపై నిశితంగా గమనించాల్సి ఉందని అంటున్నారు.

బీజేపీ నేతలు మాత్రం.. ఈ విషయంలో మౌనంగా ఉంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here