స్టార్ యాంకర్స్ కు ఆర్థిక సంక్షోభం..

మహమ్మారి వైరస్ కారణంగా అన్ని రంగాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం తెల్సిందే. అదే పరిస్థితి సినిమా రంగంపై కూడా పడటంతో హీరోలు దర్శకులు ఇతర నటీనటులు అంతా కూడా తమ పారితోషికంను 25 నుండి 50 శాతం వరకు తగ్గించుకోవాల్సి వస్తుందట. కొందరు తక్కువ పారితోషికం తీసుకోవడం ఇష్టం లేక షూటింగ్స్ కు హాజరు కావడం లేదనే టాక్ కూడా ఉంది. ఇక స్టార్ హీరోలు కూడా తమ పారితోషికాలు తగ్గించుకుంటున్నారట. హీరోయిన్స్ ఇప్పటికే పలువురు తమ పారితోషికాలు తగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క ‘క్యాష్’ ఎపిసోడ్ కోసం సుమ 1.5 లక్షల నుండి 1.75 లక్షల వరకు పారితోషికం తీసుకునేదట. కాని విపత్తు కారణంగా కొన్నాళ్ల పాటు ఆమెకు ఎపిసోడ్ కు లక్ష రూపాయలు మాత్రమే ఇవ్వగలమని మల్లెమాల వారు తేల్చి చెప్పారట. ఇక ప్రదీప్ కూడా తన పారితోషికంను తగ్గించుకున్నాడని అలాగే జబర్దస్త్ ముద్దుగుమ్మలు అనసూయ మరియు రష్మిలకు కూడా మల్లెమాల వారు పారితోషికంలో కోత విధించారట.

సినిమా రంగానికి మాత్రమే కాకుండా బుల్లి తెరకు కూడా ఈ ప్రభావం పడ్డట్లుగా తెలుస్తోంది. సీరియల్స్ షో లు లేకపోవడంతో గత రెండు మూడు నెలల కాలంగా టెలివిజన్ రంగంకు ఆదాయం తగ్గింది. ఆ కారణంగానే ఇప్పుడు యాంకర్స్ పారితోషికాలను తగ్గించినట్లుగా తెలుస్తోంది. తెలుగులో టాప్ యాంకర్స్ గా పేరున్న సుమ.. ప్రదీప్.. అనసూయ.. రష్మి ఇంకా మరికొందరు కూడా తమ పారితోషికంను తగ్గించుకోవాల్సి వచ్చిందట.

ఈమద్య కాలంలో కొత్త షోలు ఏమీ ప్రారంభం అయ్యే పరిస్థితి లేదు. కనుక యాంకర్స్ తక్కువ పారితోషికం అయినా మారు మాట్లాడకుండా చేసేస్తున్నారట. పరిస్థితులు మళ్లీ కుదుట పడ్డ తర్వాత పూర్వ పారితోషికాలు వస్తాయనే ఆశాభావంతో వారంతా ఉన్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here