శ్రీమంతుడు సినిమా అంటే నాకు పిచ్చి .. డబ్భై సార్లు చూసాను – ఆంధ్రా డీజీపీ

మహేష్ బాబు కెరీర్ లోనే అతిపెద్ద గ్రాసర్ గా నిలిచింది శ్రీమంతుడు సినిమా. మహేష్ ఆ తరవాత వచ్చిన బ్రహ్మోత్సవం తో భారీ ప్లాప్ రాగా ఇప్పుడు స్పైడర్ తో విడుదల కి సిద్దం అవుతున్నాడు. విడుదల అయ్యి రెండేళ్ళు అవుతున్నా కూడా శ్రీమంతుడు సినిమా అంటే అందరికీ ఆసక్తే. ముఖ్యంగా ఆ పల్లెటూళ్ళు దత్తత తీసుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందొ అది చాలా పాజిటివ్ గా చూపించాడు డైరెక్టర్ కొరటాల శివ. సో ఈ సినిమా మీద ఇప్పుడొక కొత్త న్యూస్ వచ్చింది. రీసెంట్ గా గుంటూర్ లు శ్రీ కృష్ణ దేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారం తో పోలీసుల కుటుంబాల విద్యార్ధులకి ఆంధ్రా డీజీపీ సాంబశివరావు ఉపకార వేతనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకి శ్రీమంతుడు సినిమా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అని అన్నారు ఆయన. పోలీసుగా ఉండే తనకి ఆ సినిమా తో సంబంధం లేకపోయినా జగపతి బాబు క్యారెక్టర్ , మహేష్ క్యారెక్టర్ బాగా నచ్చాయి అనీ , ఇప్పటికే ఆ సినిమా డబ్భై సార్లు చూసాను అనీ చెప్పారు డీజీపీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here