“రాధే శ్యామ్” ఫస్ట్ లుక్ ప్రేమ‌కి ప్ర‌తిరూపంగా ఉందిగా…

బాహుబలి ఫ్రాంఛైజీ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్వించ దగ్గ చిత్రం గా ఎప్పటికి నిలిచిపోతుంది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాతో ప్రభాస్ కి హాలీవుడ్ స్టార్ రేంజ్ లో ఫేం అండ్ క్రేజ్ వచ్చింది. అంతేకాదు టాలీవుడ్ హీరోలలోనే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని సాధించిన మొదటి హీరో ప్రభాస్ కావడం విశేషం. ఇక ఈ సినిమా గొప్పతనాన్ని దేశ దేశాలు చెప్పుకునేలా చేశాడు దర్శక ధీరుడు. ఇదీ మన తెలుగు సినిమా సత్తా అని ఇండస్ట్రీ మొత్తం చెప్పుకునే అవకాశాన్ని అందరీకీ ఇచ్చి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు.

ఇక ప్రభాస్ ఇదే క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ బాహుబలి నిర్మాణంలో ఉండగానే సాహో సినిమాని ప్రకటించాడు. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ కి సాహో లాంటి భారీ బడ్జట్ తో రూపొందే సినిమా ఇచ్చి ఇండస్ట్రీలో అందరికీ షాకిచ్చాడు. అసలు ఒక్క సినిమా ..అది కూడా చిన్న సినిమా చేసిన సుజీత్ కి ప్రభాస్ ఛాన్స్ ఎలా ఇచ్చాడన్న క్యూరియాసిటీ అందరిలోను కలిగింది.

అయితే బాహుబలి కన్‌క్లూజన్ రిలీజ్ రోజు సాహో నుంచి వచ్చిన టీజర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభాస్ దర్శకుడి విషయంలో తీసుకున్న జడ్జ్‌మెంట్ కరెక్ట్ అనుకున్నారు. ఇక ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజైంది. మేకింగ్ పరంగా సూపర్ అన్న టాక్ వచ్చినప్పటికి ప్రభాస్ ని కాస్త నిరాశపరచింది.

అయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. వెంటనే మరో యంగ్ డైరెక్టర్ రాధ కృష్ణ కుమార్ తో తన 20 వ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. అదే “రాధే శ్యామ్”. ఈ దర్శకుడికి కూడా “రాధే శ్యామ్” రెండవ సినిమా కావడం ఆశ్చర్యకరం. ఇక ఈ సినిమాని గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పిస్తుండగా యువి క్రియోషన్స్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా విదేశాలలో 70 శాతం చిత్రీకరణ పూర్తవగా లాక్ డౌన్ తో ఆగిన షూటుంగ్ తిరిగి త్వరలో మొదలు పెట్టబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్ అవుతోంది. అయితే ప్రభాస్ రాదే శ్యామ్ టైటిల్ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కేవలం ప్రభాస్ సోలో లుక్ రిలీజ్ చేస్తారని.. యాక్షన్ బేస్డ్ గా ఈ ఫస్ట్ లుక్ ఉంటుందని అనుకున్నారు. పూజా హెగ్డే ని రివీల్ చేస్తారని ఏ ఒక్కరు ఊహించలేదు. కాని ప్రభాస్ సినిమా థీం ని రివీల్ చేస్తూ రొమాంటిక్ లవ్ స్టోరీ అని హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఒకేసారి తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో పోస్టర్ ని రిలీజ్ చేయడం కూడా పెద్ద ట్విస్ట్.

ఇక ప్రభాస్ పూజా హెగ్డే లుక్ తో పాటు బ్యాగ్రౌండ్ లో కనిపిస్తున్న రెడ్ కలర్ ట్రాజడీ లవ్ స్టోరీ అన్న మరో హింట్ అని తెలుస్తుంది. మొత్తానికి యంగ్ డైరెక్టర్ క్రియోటివిటీ అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here