మిడతల దండు వస్తోంది.. బీజేపీపై విజయసాయి ట్వీట్

టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది అన్నారు విజయసాయి. ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయని సెటైర్లు.

టీడీపీ నేతలు, అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈసారి ట్విట్టర్ వేదికగా బీజేపీని కూడా టార్గెట్ చేశారు. టీడీపీ నుంచి వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది అన్నారు విజయసాయి. ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయని.. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి అంటూ కాస్త రూటు మార్చారు.

 

స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ. ప్రజా తీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదని.. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న జగన్ గారిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవు అన్నారు. మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదంటున్నారు.

 

ఎన్నికలకు ముందు జగన్ గారు అసలు అధికారంలోకి రానే రారన్నాడు ఓ పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న ఓ విశాఖ గల్లీ నాయకుడు అంటూ ఓ నేతపై విరుచుకుపడ్డారు. పచ్చ మీడియాలో డిబేట్లతో ఊదరగొట్టి ఇప్పుడు పూర్తికాలం అధికారంలో ఉండరంటున్నాడు. ఈ చంద్రబాబు తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయి అంటూ సెటైర్లు పేల్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here